rs 100: కరెన్సీ నోట్ల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్న రిజర్వ్ బ్యాంక్

  • కనుమరుగు కానున్న ప్రస్తుత 100 నోటు
  • పాతవాటి స్థానంలో కొత్త నోటు
  • ఏప్రిల్ నుంచి ముద్రణ ప్రారంభం

రిజర్వ్ బ్యాంక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాత వంద రూపాయల నోట్లను క్రమంగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది, వీటి స్థానంలో కొత్త వంద రూపాయల నోట్లను ప్రవేశ పెట్టనుంది. కొత్త 200 రూపాయల నోట్లను వచ్చే ఏడాది మార్చి కల్లా మార్కెట్లోకి పూర్తిగా ప్రవేశ పెట్టి, ఆ తర్వాత కొత్త వంద రూపాయల నోట్ల ముద్రణను ప్రారంభించాలని భావిస్తోంది. నోటు సైజులో మార్పు లేకుండా పాత నోటు సైజులోనే కొత్తవాటిని ముద్రించాలని అధికారులు నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త వంద రూపాయల నోటు ముద్రణ జరుగుతుందని వెల్లడించింది. 

  • Loading...

More Telugu News