motkupalli narasimhulu: తీవ్రంగా నిరాశచెందాను...దసరా కూడా జరుపుకోలేదు: మోత్కుపల్లి

  • గవర్నర్ పదవి వస్తుందని ఆశించా
  • గవర్నర్ పదవి రాకపోవడంతో నా కుటుంబ సభ్యులు కంటతడిపెట్టుకున్నారు
  • కనీసం దసరా కూడా జరుపుకోలేదు
  • చంద్రబాబుపై నమ్మకం ఉంది

గవర్నర్ పదవి రాకపోవడం పట్ల టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, గవర్నర్ పదవి రాకపోవడంతో నిరాశచెందానని అన్నారు. తన కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారని ఆయన తెలిపారు. తాను మరింత నిరాశచెందానని ఆయన చెప్పారు. ఆ బాధతో దసరా కూడా చేసుకోలేదని ఆయన అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తనకు నమ్మకం ఉందని ఆయన తెలిపారు. కనీసం రాజ్యసభ పదవి అయినా వస్తుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. భవిష్యత్ లో బీజేపీ, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవచ్చు కానీ, కాంగ్రెస్ తో మాత్రం పొత్తు పెట్టుకోమని ఆయన తెలిపారు. 

motkupalli narasimhulu
governor
Telugudesam
  • Loading...

More Telugu News