telangana: తెలంగాణకు మరో మూడు రోజుల పాటు వర్ష సూచన
- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- ఛత్తీస్ గఢ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా ద్రోణి
- కోస్త్రాంధ్రకు ఆనుకుని రాయలసీమ వరకు మరో ద్రోణి
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా... రహదార్లు చెరువులను తలపించాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... దీనికి తోడు ఛత్తీస్ గఢ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. అలాగే కోస్తాంధ్రకు ఆనుకుని రాయలసీమ వరకు మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. 48 గంటల్లో ఈ ఊపరితల ఆవర్తనం బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని... దీని ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు.