prabhas: వెబ్ సిరీస్ గా రానున్న 'బాహుబలి'
- సంచలన విజయానికి నిర్వచనంగా నిలిచిన 'బాహుబలి'
- వెబ్ సిరీస్ దిశగా అడుగులు
- 375 కోట్లతో ఒప్పందం
- త్వరలో వివిధ భాషలకి చెందిన నటీనటుల ఎంపిక
'బాహుబలి' .. తెలుగు సినిమా గొప్పతనాన్ని .. వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమా మొదటిభాగం 600 కోట్లకి పైగా వసూలు చేస్తే, రెండవ భాగం 1000 కోట్లకి పైగా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన ఈ సినిమా, ఇక వెబ్ సిరీస్ గా కూడా ప్రేక్షకులను పలకరించనుంది.
అంతర్జాతీయ ఆన్ లైన్ స్ట్రీమింగ్ కంపెనీ 'నెట్ ఫ్లిక్స్' .. 'బాహుబలి' వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు రంగంలోకి దిగింది. ఇందుకుగాను వాళ్లు 375 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా సమాచారం. ఈ వెబ్ సిరీస్ కోసం 'బాహుబలి' సినిమా రెండు భాగాలను తిరిగి రీ షూట్ చేస్తారట. ఒక్కో ఎపిసోడ్ కి 7.5 కోట్లను ఖర్చు చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం వివిధ భాషల్లో వెండితెరకి .. బుల్లితెరకి చెందిన నటీనటులను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.