news anchor: టీవీ ఛానెల్ చర్చలో యాంకర్ ప్రసవ వేదన... సోషల్ మీడియాలో వైరల్!

  • ట్విట్టర్ పదాల పెంపుపై చర్చ నిర్వహించిన నటాలియా  
  • నిపుణుల చర్చలో నవ్వు... ఒత్తిడికి బయటికి వచ్చిన ఉమ్మనీరు
  • ప్రసవ వేదన అనుభవిస్తూనే సమయస్ఫూర్తితో వ్యవహరించిన యాంకర్ 

టీవీలో చర్చాకార్యక్రమం నిర్వహించే యాంకర్ కార్యక్రమం మధ్యలో ప్రసవ వేదన అనుభవించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. న్యూయార్క్‌ టీవీ ఛానెల్ లో నటాలియా పస్‌ క్వరెల్లా పేరున్న యాంకర్‌. తాజాగా ట్విట్టర్ మెసేజింగ్ విధానంలో మార్పులు చేస్తూ, పదాల సంఖ్యను పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చాకార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. నిపుణులతో చర్చ మధ్యలో వారి సంభాషణకు నవ్వొచ్చి గట్టిగా నవ్వింది. దీంతో ఆమె గర్భంపై ఒత్తిడి కలిగి ఉమ్మనీరు బయటకు వచ్చింది. దీంతో కార్యక్రమం మధ్యలోనే ప్రసవ వేదన అనుభవించింది.

అప్పుడే సమయస్ఫూర్తితో వ్యవహరించి విషయం ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ కు వివరించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె భర్తకు ఈ విషయం తెలియజేశారు. ఆసుపత్రికి వెళ్లిన పదమూడు గంటల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పుట్టిన బిడ్డకు జమీన్ జేమ్స్ అని పేరుపెట్టారు. ఈ మేరకు బిడ్డ, భర్తతో దిగిన ఫోటోను ఆమె ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ సంఘటన ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.  

news anchor
new York tv
natalia paskwarella
  • Loading...

More Telugu News