ntr: నవంబర్లో ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం!

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీకి స్క్రిప్ట్ సిద్ధం
  • త్వరలో నటీనటుల ఎంపిక
  • నవంబర్లో పూజా కార్యక్రమాలు
  • ఫిబ్రవరి - మార్చిలలో రెగ్యులర్ షూటింగ్     

ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాను తెరకెక్కిస్తోన్న త్రివిక్రమ్ .. ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించి కీలకమైన పాత్రల కోసం ఎవరిని తీసుకోవాలనే విషయంలో త్రివిక్రమ్ ఒక క్లారిటీతో వున్నాడట. అలాగే సాంకేతిక నిపుణుల విషయంలోను ఫలానా వారిని తీసుకోవాలనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్లో నిర్వహించి, రెగ్యులర్ షూటింగును ఫిబ్రవరి - మార్చి లలో ఆరంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కథానాయికలుగా ఎమీ జాక్సన్ .. అనూ ఇమ్మాన్యుయేల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమా ఆలస్యంగా సెట్స్ పైకి వెళుతుండటం వలన, పక్కా ప్లానింగ్ తో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.    

ntr
  • Loading...

More Telugu News