padmavathi: 'అల్లావుద్దీన్ ఖిల్జీ' ఇలా ఉంటాడని ఫోటో పెట్టిన సంజయ్ లీలా భన్సాలీ!

  • భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ
  • ఇప్పటికే పద్మావతి, మహారావల్ రతన్ సింగ్ లుక్స్ రివీల్ చేసిన భన్సాలీ
  • అల్లావుద్దీన్ ఖల్జీగా ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న రణ్ వీర్ సింగ్

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఒక సినిమాను ప్రకటించాడంటే దానిపై అంతా ఆసక్తిగా వ్యక్తం చేస్తుంటారు. భారీ సెట్టింగులతో కళాఖండాలు అనిపించదగ్గ సినిమాలు చేస్తాడని భన్సాలీకి బాలీవుడ్ లో పేరుంది. అలాంటి భన్సాలీ 'పద్మావతి' సినిమాను ప్రకటించాడు. అప్పటి నుంచి ఆ సినిమాను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. రాజస్థాన్, గుజరాత్ లలో షూటింగ్ ను కూడా పలుమార్లు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఒక సారి సెట్ తగులబడిపోయింది. అయినా ఏమాత్రం వెనుకడుగు వేయని భన్సాలీ...'పద్మావతి'గా దీపికా పదుకునే ఫొటోను రివీల్ చేసి ఆ సినిమాపై అంచనాలను పెంచేశాడు.

తరువాత ఆమె భర్త 'మహారావల్ రతన్ సింగ్' గా నటించిన షాహిద్ కపూర్ లుక్ ను విడుదల చేశాడు. తాజాగా, అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అల్లావుద్దిన్‌ ఖిల్జీ’ పాత్రను రివీల్ చేశాడు. ఈ సినిమాలో కీలకమైన ‘అల్లావుద్దీన్ ఖిల్జీ’ ఫస్ట్‌ లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో రణ్ వీర్ సింగ్ పొడవాటి కేశాలు, కంటి కింద గాటుతో అదిరిపోయాడని అభిమానులు పేర్కొంటున్నారు. విడుదలైన కాసేపటికే ఇది ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది. 

padmavathi
deepika padukone
shahid kapoor
ranveer singh
sunjay leela bhanshali
  • Loading...

More Telugu News