Mahatma Gandhi: మీకీ విషయం తెలుసా?.. మహాత్మా గాంధీ మంచి క్రికెటర్!

  • బౌలింగ్, బ్యాటింగ్‌లో విశేష ప్రతిభ
  • గాంధీపై కొత్త పుస్తకం
  • వెలుగులోకి కొత్త విషయాలు

దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన మహాత్మాగాంధీ మంచి క్రికెటర్ అనే విషయం చాలామందికి తెలియదు. ఆయనకు క్రికెట్ అంటే ఎనలేని ఇష్టం. బ్యాటింగ్, బౌలింగ్‌లో చక్కని ప్రతిభ కనబరిచేవారట. విద్యార్థి దశలో క్రికెట్ మైదానంలో గాంధీ పోరాట పటిమను ప్రదర్శించేవారని కౌశిక్ బందోపాధ్యాయ తన తాజా పుస్తకం ‘మహాత్మా ఆన్ ద పిచ్: గాంధీ అండ్ క్రికెట్ ఇన్ ఇండియా’ పేరిట రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.

గాంధీ బాల్య స్నేహితుడు రతిలాల్ గేలాభాయ్ మెహతా వ్యాఖ్యలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. గాంధీకి వ్యాయామాలు చేయడం అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదని, అయితే క్రికెట్ అంటే మాత్రం చాలా ఇష్టపడేవారని మెహతాను ఉటంకిస్తూ పేర్కొన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ చక్కగా చేసేవారని వివరించారు. కాగా, భారత్‌లో రాజకీయాలు, క్రికెట్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న నేపథ్యంలోనే తానీ పుస్తకాన్ని రాసినట్టు కౌశిక్ తెలిపారు.

Mahatma Gandhi
Cricketer
India
Kausik Bandyopadhyay
  • Loading...

More Telugu News