jakeer naik: మలేషియాలో మకాం వేసిన జకీర్ నాయక్.. సమాచారం ఇవ్వని మలేషియా

  • మలేషియా మసీదులో జకీర్
  • సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఫొటో
  • మా దేశంలో లేడంటున్న మలేషియా

ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ మలేషియాలో తలదాచుకున్నట్టు వెల్లడైంది. శుక్రవారంనాడు ఆయన మలేషియాలోని ఓ మసీదుకు వెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మసీదుకు ఐరన్ మాస్క్ అనే పేరు కూడా ఉంది. మసీదులో ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు జకీర్ నాయక్ ఫొటోను డాక్టర్ మహ్మద్ సయీద్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

జకీర్ నాయక్ ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరినప్పటికీ... ఆయన మా దేశంలో లేరంటూ మలేషియా తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలు, మనీ లాండరింగ్ కేసుల్లో జకీర్ నాయక్ నిందితుడిగా ఉన్నాడు. ఆయన పాస్ పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు జకీర్ కు సౌదీ అరేబియా పౌరసత్వం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, మలేషియా కూడా ఐదేళ్ల క్రితం పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ ఇచ్చినట్టు సమాచారం.  

jakeer naik
malaysia
india
  • Loading...

More Telugu News