perfume: పర్‌ఫ్యూమ్‌ల కారణంగా ఆస్తమా, మైగ్రేన్?
- పరిశోధనలో వెల్లడి
- వివరాలను పుస్తకంలో ప్రచురించిన రచయిత్రి
- కృత్రిమ వాసనకారుల వాడకమే కారణం
పర్‌ఫ్యూమ్‌లలో ఉన్న కృత్రిమ వాసన పడకపోవడం వల్ల ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి ఆస్తమా, మైగ్రేన్, దురద వంటి సమస్యలు వస్తున్నాయని ఓ పరిశోధనలో తేలింది. `ద కేస్ అగైనెస్ట్ ఫ్రాగ్రాన్స్` అనే పుస్తకంలో రచయిత్రి కేట్ గ్రాన్‌విల్లే ఈ పరిశోధన అంశాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న అన్ని రకాల పర్‌ఫ్యూమ్‌లు, సెంట్లలో వాసన గాఢత ఎక్కువ సేపు నిలవడం కోసం కృత్రిమ పదార్థాలను ఉపయోగిస్తున్నారని, వాటి కారణంగా చాలా మంది మైగ్రేన్ వంటి సమస్యల బారిన పడుతున్నారని ఆమె పుస్తకంలో పేర్కొన్నారు.
సాధారణంగా పర్‌ఫ్యూమ్ తయారు చేసేవారు తమ పర్‌ప్యూమ్‌లలో వాడే పదార్థాల గురించి బయటికి చెప్పరు. సహజంగా దొరికే కొన్ని వస్తువులకు వారు కృత్రిమ వాసనకారులను కలిపి పర్‌ఫ్యూమ్‌లు తయారు చేస్తారు. ఈ వాసన గాఢత కారణంగా కొన్ని సార్లు శరీరంలోని వ్యాధినిరోధక శక్తి కూడా మందగించే ప్రభావం ఉంటుంది. యూకలిప్టస్ ఆయిల్, రోజ్ వాటర్ వంటి వాటిని మోతాదుకు మించి ఉపయోగిస్తే ఎలర్జీ కలగడం, కాలేయం చెడిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.