mahatma gandhi: వెయ్యిమంది గాంధీలు, లక్ష మంది మోదీలు వచ్చినా అది సాధ్యం కాదు!: నరేంద్ర మోదీ

  • స్వచ్ఛ భారత్ ప్రజల మార్పుతోనే సాధ్యం
  • గాంధీలు, మోదీలు ఏమీ చేయలేరు
  • దేశం శక్తిమంతంగా మారాలంటే... ముందు పరిశుభ్రంగా మారాలి

మన దేశం స్వయం పాలనకు ఎప్పుడో వచ్చినప్పటికీ మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉందని భారత ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ ను సాధించడం చాలా ముఖ్యమని చెప్పారు. స్వచ్ఛ భారత్ ను విజయవంతం చేయడంలో పౌర సమాజంలోని సభ్యులు, మీడియాది కీలక పాత్ర అని అన్నారు.

వెయ్యి మంది గాంధీలు, లక్ష మంది మోదీలు వచ్చినా స్వచ్ఛ భారత్ లక్ష్యం సాధ్యం కాదని చెప్పారు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు ఎప్పుడైతే నడుం బిగిస్తారో, అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని చెప్పారు. ఒక దేశం శక్తిమంతమైనదిగా రూపుదిద్దుకోవాలంటే... దాని కంటే ముందు పరిశుభ్రతతో కూడిన దేశంగా మారాలని అన్నారు.

mahatma gandhi
narendra modi
swachch bharath
  • Loading...

More Telugu News