rohit sharma: రాబోయే రోజుల్లో క్రికెట్ రారాజులం మనమే: రోహిత్

  • ఆటగాళ్లందరిలోనూ కసి కనిపిస్తోంది
  • రిజర్వ్ బెంచ్ ఎంతో బలంగా ఉంది
  • ఎవరికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారు

వరుస సిరీస్ విజయాలతో గత కొంతకాలంగా టీమిండియా సత్తా చాటుతోంది. తాజాగా బలమైన ఆస్ట్రేలియాను కూడా చిత్తు చేసి విజయ దరహాసం చేసింది. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టుకు అమోఘమైన భవిష్యత్తు ఉందని చెప్పాడు. మన రిజర్వ్ బెంచ్ ను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని తెలిపాడు.

జట్టులో ఎవరికి అవకాశం కల్పించినా... వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పాడు. దీనికి ఐదో వన్డేనే ఉదాహరణ అని... చాహల్ కు విశ్రాంతినిచ్చి అక్షర్ పటేల్ కు స్థానం కల్పిస్తే, అతను సత్తా చాటాడని తెలిపాడు. జట్టులో ప్రతి ఒక్కరిలోనూ కసి కనిపిస్తోందని చెప్పాడు. ఇలాంటివన్నీ భారత క్రికెట్ భవిష్యత్తు అమోఘంగా ఉండబోతోందనే చెబుతున్నాయని అన్నాడు. రానున్న రోజుల్లో మనమే రారాజులం అని చెప్పాడు.

rohit sharma
team india
indian cricket
australia series
  • Loading...

More Telugu News