jio: కస్టమర్లకు షాక్.. వాయిస్ కాల్స్ పై పరిమితులు విధించనున్న జియో

  • రోజుకు 300 నిమిషాలు మాత్రమే ఫ్రీ వాయిస్ కాల్స్
  • 4జీ డేటా మాదిరే పరిమితులు
  • సదుపాయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న జియో

జియో సిమ్ ను వాడుతున్న వారికి అపరిమిత వాయిస్ కాల్స్ ఆఫర్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సదుపాయంపై పరిమితులు విధించేందుకు జియో రెడీ అవుతోంది. రోజుకు కేవలం 300 నిమిషాలు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునేలా నిబంధన విధించబోతున్నట్టు రిపోర్టులు తెలిపాయి.

అపరిమిత కాల్స్ ఫీచర్ తో కొంతమంది వినియోగదారులు రోజుకు 10 గంటలకు పైగా మాట్లాడుతూ, సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తుండటమే దీనికి కారణం. వాయిస్ కాల్స్ ఫీచర్ పక్కదారి పడుతోందని జియో గుర్తించినట్టు టెలికాంటాక్ట్ జియో ప్రియారిటీ టీమ్ తెలిపింది. 4జీ డేటా మాదిరిగానే వాయిస్ కాల్స్ పై కూడా పరిమితి తెస్తున్నట్టు వెల్లడించింది.

2016 సెప్టెంబర్ లో జియో లాంచ్ అయినప్పుడు 4జీ డేటాను కూడా అపరిమితంగానే ఆఫర్ చేసింది. అయితే డేటా వాడకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించిన జియో... ఆ తర్వాత డేటా వాడకంపై పరిమితులను విధించింది. ప్రస్తుతం రోజుకు ఒక జీబీ డేటాను అందిస్తోంది. 1జీబీ డేటా తర్వాత డేటా స్పీడు పడిపోతుంది. ఇదే రీతిలో ఇప్పుడు వాయిస్ కాల్స్ పై కూడా పరిమితులు విధించేందుకు జియో రంగం సిద్ధం చేస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News