airport: విమానాన్ని తాళ్లతో లాగే పోటీ... పాల్గొన్న 50 బృందాలు... వీడియో చూడండి
- ప్రతి 20 మంది ఒక బృందం
- పాల్గొన్న న్యూజెర్సీ పోలీసు అధికారులు
- స్పెషల్ ఒలింపిక్స్ కోసం నిధుల సేకరణలో భాగం
అమెరికాలో న్యూజెర్సీలో ఉన్న నేవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వినూత్న పోటీ జరిగింది. విమానానికి తాళ్లు కట్టి దాన్ని కొంత దూరం వరకు లాక్కెళ్లాలి. అలా కొంత దూరాన్ని తక్కువ సమయంలో లాక్కెళ్లిన బృందం విజేతగా నిలుస్తుంది. 42,200 కేజీల బరువున్న బోయింగ్ 737 విమానాన్ని పది అడుగుల దూరం లాగడానికి 50కి పైగా బృందాలు పోటీపడ్డాయి.
వీరంతా న్యూజెర్సీలో పనిచేసే వివిధ పోలీసు శాఖలకు చెందిన వారు. న్యూజెర్సీ స్పెషల్ ఒలింపిక్స్ నిర్వహణకు నిధులు సేకరించడం కోసం ఈ పోటీని నిర్వహించారు. ఇందులో 20 మంది ఒక బృందంగా తయారై తాళ్లతో కట్టిన విమానాన్ని పది అడుగుల దూరం లాగాల్సి ఉంటుంది.