utham kumar reddy: కాంగ్రెస్ పార్టీ మా మనోభావాలను దెబ్బతీసింది: ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్యవైశ్యుల లేఖ

  • ఐలయ్యకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు ప్రకటన చేశారు
  • ఐలయ్య పుస్తకాన్ని నిషేధించేలా ఒత్తిడి తీసుకురండి
  • మీ మద్దతు కావాలి

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్యవైశ్య సంఘం లేఖ రాసింది. వైశ్యులను కించపరిచిన కంచ ఐలయ్యకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని లేఖలో ప్రశ్నించింది. కంచ ఐలయ్యకు మద్దతుగా కొందరు కాంగ్రెస్ ప్రముఖులు ఢిల్లీలో ప్రకటన చేశారని విమర్శించింది. కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఆర్యవైశ్యుల మనోభావాలను గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేసింది.

 ఐలయ్య రచించిన పుస్తకాన్ని నిషేధించేలా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకురావాలని, ప్రధాన ప్రతిపక్షమైన మీ మద్దతును తాము కోరుతున్నామని తెలిపింది. ఆర్యవైశ్యులను టార్గెట్ చేస్తూ 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకాన్ని ఐలయ్య రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఐలయ్యపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. పలు చోట్ల ఆయనపై కేసులు కూడా పెట్టారు. 

utham kumar reddy
tpcc
aryavaisya
kancha ilaiah
saamajika smaglarlu komatollu
  • Loading...

More Telugu News