sasikala: పెరోల్ కు దరఖాస్తు చేసుకున్న శశికళ!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d8209956f8635cb383be97b958b54e98e572c42e.jpg)
- కొంత కాలంగా కాలేయం, కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్న శశికళ భర్త నటరాజన్
- భర్తను చూడాలంటూ పెరోల్ కు దరఖాస్తు చేసుకున్న శశికళ
- గ్లెనిగిల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటరాజన్
తమిళనాడులో శశికళ రాజకీయ సమాధికి పళనిస్వామి, పన్నీరు సెల్వం ప్రణాళికలు రచించడం.. కేసులు, అరెస్టులకు భయపడి రిసార్టుకు తరలించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరిగి చెన్నై చేరుకోవడం.. ఈ నేపథ్యంలో టీటీవీ దినకరన్ చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న దివంగత జయలలిత నెచ్చెలి శశికళ పెరోల్ కు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఆమె భర్త నటరాజన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో శశికళ పెరోల్ కోరినట్లు ఆయన వెల్లడించారు.
కాగా, గత కొంత కాలంగా కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న నటరాజన్ గ్లెనెగిల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భర్తను చూసేందుకు శశికళ పెరోల్ కోరారని దినకరన్ తెలిపారు. ఒకవేళ ఆమె పెరోల్ పై వస్తే తమిళనాడు రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.