allu arjun: బన్నీ నెక్స్ట్ మూవీ మొదలయ్యేది అప్పుడేనట!

  •  బన్నీ నెక్స్ట్ మూవీ లింగుస్వామితో 
  •  స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మాణం 
  •  ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి
  •  మార్చిలో రెగ్యులర్ షూటింగ్

ప్రస్తుతం అల్లు అర్జున్ .. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. ఒక వైపున ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున బన్నీ నెక్స్ట్ మూవీకి సంబంధించిన పనులు కూడా జరిగిపోతున్నాయి.

బన్నీ తదుపరి సినిమా లింగుస్వామి దర్శకత్వంలో ఉందనే సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన లింగుస్వామి, హీరోయిన్ తో పాటు మిగతా నటీనటులను ఎంపిక చేసే పనిలో వున్నాడు. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఆయన వున్నట్టుగా సమాచారం. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా రూపొందనుండటం విశేషం.  

  • Loading...

More Telugu News