revanth reddy: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

  • కొత్త జిల్లాలకు ఇంకా కేంద్ర ఆమోదం లభించలేదు
  • కేంద్ర పథకాల అమల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి
  • మోదీని పలు సార్లు కలిసినా ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదు?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ఏడాది గడిచినా... వాటికి ఇంత వరకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. గెజిట్ లో ఇంతవరకు కొత్త జిల్లాలను ప్రకటించకపోవడంతో... కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు. ప్రధాని మోదీని తమరు చాలా సార్లు కలిశారని... అయినా, కొత్త జిల్లాల గురించి ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదని రేవంత్ ప్రశ్నించారు. 

revanth reddy
tTelugudesam
kcr
telangana cm
revanth open letter to kcr
  • Loading...

More Telugu News