sachin tendulkar: స‌చిన్ మొద‌టి వీడియో ఇంట‌ర్వ్యూ ఇదిగో .... చేసింది టామ్ ఆల్ట‌ర్‌!

  • అప్పుడు స‌చిన్ వ‌య‌సు 15 ఏళ్లు
  • శుక్ర‌వారం మ‌ర‌ణించిన టామ్‌
  • గుర్తు చేసుకున్న క్రికెట‌ర్లు

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌ను మొద‌టిసారి టీవీలో ఇంట‌ర్వ్యూ చేసిందెవ‌రో తెలుసా... ఇటీవ‌ల మ‌ర‌ణించిన బాలీవుడ్ న‌టుడు టామ్ ఆల్ట‌ర్‌. చ‌ర్మ కేన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న శుక్ర‌వారం రోజు క‌న్నుమూశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ఇంట‌ర్వ్యూ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.

 80-90ల్లో స్పోర్ట్స్‌ జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసిన ఆయ‌న స‌చిన్ టెండూల్క‌ర్‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. ఓ టీవీ ఛాన‌ల్ కోసం స‌చిన్‌ను ఇంట‌ర్వ్యూ చేసిన మొద‌టి వ్య‌క్తి టామ్ ఆల్ట‌ర్‌. అప్ప‌టికి స‌చిన్‌కి 15 ఏళ్లే. ఇంకా భార‌త్ త‌ర‌ఫున ఆడ‌లేదు. గుజరాత్ జ‌ట్టుతో జ‌రిగిన రంజీ మ్యాచ్‌లో ముంబై జ‌ట్టు త‌ర‌ఫున ఆడిన స‌చిన్ సెంచ‌రీ చేశాడు. దీంతో ఆ త‌ర్వాత వెస్టిండీస్‌తో జ‌ర‌గాల్సిన మ్యాచ్‌లో ఆడ‌టానికి స‌చిన్‌కు భార‌త జ‌ట్టులో చోటు క‌ల్పించాల‌ని క్రికెట్ పెద్ద‌లు యోచించారు. ఆ స‌మ‌యంలో టామ్ ఈ ఇంట‌ర్వ్యూ చేశారు. ఆయన మ‌ర‌ణానికి సంతాపంగా చాలా మంది క్రికెట‌ర్లు ఆయ‌న‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

sachin tendulkar
video interview
tom alter
cricket legend
god of cricket
  • Error fetching data: Network response was not ok

More Telugu News