bigboss: హిందీ 'బిగ్ బాస్'లో దావూద్ బంధువు...తొలిరోజే కంటెస్టెంట్ తో గొడవ!

  • బిగ్ బాస్ లో దావూద్ ఇబ్రహీం బంధువు
  • దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమార్తె భర్తే జుబైర్ ఖాన్
  • బాలీవుడ్ చీకటి కోణాలు బయటపెడతానన్న జుబైర్ 

మాఫియా డాన్ దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ అల్లుడు జుబైర్‌ ఖాన్‌ హిందీ బిగ్‌ బాస్‌ షోలో పాల్గొంటున్నాడు. కలర్స్‌ టీవీ చానెల్‌ లో ప్రసారమయ్యే ఈ షో నిన్న ప్రారంభమైంది. ఇప్పటికీ ముంబైలోని అండర్ వరల్డ్ ను అడ్డాగా చేసుకుని, బెదింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న దావూద్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పాడు. తాను బాలీవుడ్ లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించానని తెలిపాడు.

ముంబైకి చెందిన ఒక పత్రిక రాసిన కథనంతో తన పరువుకు భంగం వాటిల్లిందని, దీంతో చాలా మంది తనకు దూరం జరిగారని అన్నాడు. తన పిల్లలను తీసుకుని తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని అన్నాడు. తన పిల్లలే తనకు సర్వమని, తననుంచి తన పిల్లలు దూరం కావడం తట్టుకోలేకపోతున్నానని చెప్పాడు.

ఈ షోలో పాల్గొనడం ద్వారా తాను తన పిల్లలకు ప్రతిరోజూ కనిపించే అవకాశం ఉందని అన్నాడు. తనపై వేసిన అభాండాలు తొలగించుకునేందుకు బిగ్ బాస్ షోను ఉపయోగించుకుంటానని తెలిపాడు. బాలీవుడ్‌ లో అనేక చీకటి కోణాలు తనకు తెలుసునని, త్వరలోనే వాటిని బయటపెడతానని హెచ్చరించాడు.

సమస్య వస్తే బాలీవుడ్ లో చాలామంది దావూద్‌ తో మాట్లాడతారని ఆయన చెప్పాడు. బాలీవుడ్‌ లో మురికి రాజకీయాలు ఎక్కువ అని జుబైర్‌ తెలిపాడు. ఈ షోలో తొలిరోజే పునీష్ శర్మతో జుబైర్ ఖాన్ గొడవపడ్డాడు. పునీష్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 'నువ్వు బూతులు వాడితే నేనూ బూతులు వాడుతాను, నువ్వు మర్యాదగా మాట్లాడితే నేను కూడా మర్యాదగా మాట్లాడుతాను' అంటూ దీటుగా సమాధానమిచ్చాడు. 

bigboss
dawood ibrahim
jubair khan
puneesh sharma
  • Loading...

More Telugu News