Britain prince: పబ్లిక్ గా ప్రియురాలిని ముద్దాడి డేటింగ్ వార్తలను ధ్రువీకరించిన యువరాజు!

  • మోడల్ మేఘన్ మార్క్ లేతో పేమలో బ్రిటన్ యువరాజు
  • విక్టస్ గేమ్స్ ను వీక్షించిన ప్రిన్స్ హ్యారీ, మార్క్ లే
  • దగ్గరకు లాక్కుని ముద్దుపెట్టిన హ్యారీ

బహిరంగంగా ప్రియురాలిని ముద్దాడి తమ మధ్య అఫైర్ నిజమేనని బ్రిటన్ యువరాజ్ హ్యారీ ఖరారు చేశాడు. ప్రముఖ మోడల్‌ మేఘన్‌ మార్క్‌ లే, ప్రిన్స్‌ హ్యారీలు ప్రేమలో ఉన్నారంటూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. వీటిపై స్పష్టత లేకపోవడంతో రూమర్లేనంటూ పలువురు కొట్టిపడేశారు.

అయితే తాజాగా ఇన్ విక్టస్ గేమ్స్ ముగింపు ఉత్సవాలకు మార్క్ లే, ఆమె తల్లితో కలిసి ప్రిన్స్ హ్యారీ హాజరయ్యాడు. తొలుత ప్రత్యేక రూంలో కూర్చుని వీక్షించిన ఆ ముగ్గురూ తిరిగి వెళ్తున్న సమయంలో.. స్టేడియంలో అందరూ చూస్తుండగా.. హ్యారీ తన ప్రేయసిని దగ్గరకు లాక్కుని, పబ్లిక్‌ గా ముద్దుపెట్టేశాడు. దీనిని ఆమె బాగా ఆస్వాదించి, ముసిముసినవ్వులు నవ్వుతూ మురిసిపోయింది. 

Britain prince
prince harry
Meghan markle
  • Loading...

More Telugu News