garikapati narasimharao: ప్రవచనాలకు రాలేనని చెప్పేందుకు అబద్ధాలు చెబుతున్నా: గరికపాటి నరసింహరావు

  • గుళ్లు పెరిగాయి, భక్తులు కూడా పెరిగారు
  • అంతే స్థాయిలో మూఢ నమ్మకాలూ పెరిగాయి
  • తనకు బాధగా ఉందన్న గరికపాటి

ప్రజల్లో భక్తి భావం పెరిగిందని, భక్తి పెరిగిన వ్యక్తి ఏదో ఒకనాటికి ఆధ్యాత్మికతకు దగ్గర కావచ్చేమో కానీ.. భక్తికి, ఆధ్యాత్మికతకు మధ్య ఎంతో తేడా ఉందని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, పదేళ్ల క్రితంతో పోలిస్తే, దేశంలో గుళ్లు పెరిగాయని, వాటికి వస్తున్న భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు.

తమవంటి ప్రవచనకర్తలకు ఇప్పుడు ఫుల్ డిమాండని, ప్రవచనాలకు రాలేనని చెప్పేందుకు ఎన్నోమార్లు తాను అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తోందని అన్నారు. తన దృష్టిలో భక్తికన్నా మూఢ విశ్వాసాలే పెరుగుతున్నట్టుగా గోచరిస్తోందని తెలిపారు. యువతరం కూడా ఇవే విశ్వాసాల వెనుక పరుగులు పెడుతోందని అన్నారు. పేరులో అంకె మంచిది కాదని, ఫలానా అంకె కలిస్తే పని చేయకూడదని... ఇలా ఆలోచిస్తున్నారని అన్నారు. కొంతమంది జ్ఞాపకశక్తి, ధనలాభం ఇత్యాది వాటి కోసం ఏదైనా మంత్రం చెప్పండని ముందుకు వస్తున్నారని, మంత్రం పదే పదే చదివితే జ్ఞాపకశక్తి పెరగదన్న విషయం వారికి తెలియడం లేదని అన్నారు. యువతలో కూడా మూఢ నమ్మకం పెరగడం తనకు బాధేస్తోందని అన్నారు.

garikapati narasimharao
pravachanakarta
  • Loading...

More Telugu News