Ashish Nehra: ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు నెహ్రా, కార్తీక్‌లకు పిలుపు!

  • మూడు టీ20ల సిరీస్ కోసం జట్టు ఎంపిక
  • శనివారం రాంచీలో తొలి మ్యాచ్

ఆస్ట్రేలియాతో ఈనెల 7 నుంచి 13 వరకు జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌లకు 15 మంది సభ్యుల జాబితాలో చోటు లభించింది. అలాగే ఆసీస్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తిరిగి జట్టులో చేరనున్నాడు. భార్య అస్వస్థతతో బాధపడుతుండడంతో ధవన్ ఆసీస్‌తో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. కాగా, టీ20 జట్టులో ఓపెనర్ అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్‌లకు చోటు లభించలేదు.

టెస్టులు, వన్డేల్లో ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న టీమిండియా శనివారం రాంచీలో జరగనున్న తొలి టీ20లో ఆసీస్‌తో తలపడనుంది.

జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, అక్సర్ పటేల్

Ashish Nehra
Dinesh Karthik
team India
Australia
  • Loading...

More Telugu News