telangana: మందుబాబుల దిల్ ఖుష్ ... ఇక ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు మందే మందు!
- అమలులోకి 2017-2019 కొత్త మద్యం పాలసీ
- ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు మద్యం అమ్మకాలు
- హైవేలకు 220 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు, బార్లు
కొత్త మద్యం పాలసీని తెలంగాణ ప్రభుత్వం నిన్నటి నుంచి అమలులోకి తీసుకొచ్చింది. గతంలో పలు నిబంధనలతో పాటు సమయపాలన విధించిన తెలంగాణ ప్రభుత్వం మందుబాబులను కట్టడి చేసింది. తాజాగా తీసుకొచ్చిన 2017-2019 మద్యం పాలసీలో సమయపాలనలో మార్పులు చేసింది.
మొన్నటి వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం అందుబాటులో ఉండేది. తాజా నిబంధనలతో ఉదయం పది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలు చేసుకోవచ్చని ఆబ్కారీ శాఖాధికారులు తెలిపారు. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఉన్న మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు హైవేలకు 220 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని జాతీయ రహదారులపై ఉన్న అన్ని మద్యం దుకాణాలు హైవేలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలిపారు.