Rashi: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • లిమిట్స్ దాటడం లేదంటున్న రాశిఖన్నా 
  • విజయ్ తో మురుగదాస్ తదుపరి చిత్రం 
  • 'స్టార్ మా' చేతిలో 'అర్జున్ రెడ్డి' హక్కులు 
  • మహేశ్ బాబు రోమ్ షెడ్యూలు వాయిదా

*  'నా లిమిట్స్ నేను దాటడం లేదు..' అంటోంది అందాల రాశిఖన్నా. అందాల ప్రదర్శనలో మోతాదు మించుతోందన్న కామెంట్ల పట్ల స్పందిస్తూ ఆమె అలా చెప్పింది. 'నేను గ్లామర్ డోస్ పెంచానన్న కామెంట్లలో వాస్తవం లేదు. గ్లామర్ విషయంలో నా లిమిట్స్ లో నేను ఉంటున్నాను. అందంగా కనిపించినంత మాత్రాన అది ఓవర్ డోస్ కాదు కదా?' అంటూ ప్రశ్నించింది రాశి.
*  తాజాగా తెలుగు, తమిళ భాషల్లో 'స్పైడర్' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు మురుగదాస్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ హీరోగా చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  ఇటీవల వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రం బాక్సాఫీసు వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శాటిలైట్ హక్కులను 'స్టార్ మా' టీవీ భారీ రేటుకి కొనుగోలు చేసినట్టు సమాచారం.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'భరత్ అను నేను' చిత్రం యూరప్ షెడ్యూలు వాయిదా పడింది. ఈ నెల 6 నుంచి రోమ్ లో జరగాల్సిన తాజా షెడ్యూలును నిర్మాతలు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News