ramdev baba: గోమూత్రం మంచిదని ఖురాన్ లో కూడా ఉందంటున్న రాందేవ్ బాబా!

  • గోమూత్రాన్ని ప్రకృతి చికిత్సలో ఉపయోగించడాన్ని ముస్లింలు అంగీకరించాల్సిందే
  • ‘పతంజలి’ బ్రాండుపై 'హిందూ' ముద్ర వేస్తున్నారు 
  • నేనెప్పుడైనా 'హమ్ దర్ద్' సంస్థను విమర్శించానా?

యోగా గురు రాందేవ్ బాబా కొత్త పల్లవి అందుకున్నారు. గోమూత్రాన్ని ప్రకృతి చికిత్సలో ఉపయోగించడాన్ని ముస్లింలు అంగీకరించాల్సిందేనని అన్నారు. ఎందుకంటే, గోమూత్రాన్ని చికిత్సలో ఉపయోగించడం సరైనదేనన్న విషయం ఖురాన్‌ లో కూడా ఉందని ఆయన చెప్పారు.

 పలు ముస్లిం సంస్థల పెద్దలు తమ ‘పతంజలి’ బ్రాండును 'హిందూ సంస్థ' అంటూ ముద్ర వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేనెప్పుడైనా హమీద్‌ సోదరులకు చెందిన 'హమ్‌ దర్ద్‌' సంస్థను విమర్శించానా? అని ప్రశ్నించారు. పతంజలి బ్రాండ్ ను 2018 ముగిసే నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్ గా చేస్తానని ఆయన తెలిపిన సంగతి తెలిసిందే. 

ramdev baba
hamdard
patanjali
muslims
  • Loading...

More Telugu News