రొమాన్స్ సీన్లు మాత్రం వద్దే వద్దంటున్న ఐశ్వర్యా రాయ్!
- గతంలో పలు చిత్రాల్లో నటించిన షారూఖ్, ఐశ్వర్య
- మరో చిత్రంలో నటించేందుకు ఇరువురి నిరాకరణ
- విభేదాలు లేవంటూనే 'నో' చెబుతున్నారట!
ఇక తాజాగా 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో ఈ జంట చివరిసారిగా కనిపించగా, అప్పటి నుంచి షారూఖ్ కూడా ఐశ్వర్యతో కలసి వెండితెరను పంచుకునేందుకు అంగీకరించడం లేదని సమాచారం. కారణం ఏంటన్న విషయం తెలియకున్నా ఆన్ స్క్రీన్ రొమాన్స్ తనకు వద్దని ఈ బిగ్ బీ కోడలు తనను కలిసిన నిర్మాతలకు గట్టిగానే చెబుతోందట. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతూనే, కలసి నటించేందుకు మాత్రం అంగీకారం తెలపడం లేదట. ఇక ఈ విషయంలో నిజాలు తెలియాలంటే, అటు ఐశ్వర్యో, ఇటు షారూఖో నోరు విప్పాల్సిందే.