YSRCP: కువైట్‌లో అరెస్ట్ వార్తలను ఖండించిన రోజా.. తాను క్షేమంగానే ఉన్నానంటూ వీడియో విడుదల

  • ఆ వార్తలు అబద్ధమన్న రోజా
  • ‘నవరత్నాల’ సమావేశం విజయవంతం అయిందన్న ఎమ్మెల్యే
  • పోలీసులు రావడం నిజమేనన్న నేత

కువైట్‌లో తాను అరెస్టయ్యానంటూ వస్తున్న వార్తలను వైసీపీ ఎమ్మెల్యే రోజా ఖండించారు. తాను ఇంటిలోనే ఉన్నానంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వార్తలను ఎవరు, పుట్టించారో, ఎందుకు పుట్టించారో తనకు తెలియదని, తానైతే హ్యాపీగానే ఉన్నానని, తననెవరూ అరెస్ట్ చేయలేదని అందులో పేర్కొన్నారు.

కువైట్‌లో స్థానిక హోటల్‌లో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల భేటీకి 2 వేల మంది వరకు హాజరయ్యారు. ఈ సమావేశానికి అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు అడ్డుకున్నారు. సమావేశంలో కార్యకర్తలు పార్టీ నినాదాలు చేయడంపై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రోజాను కూడా వారు అదుపులోకి తీసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి.

ఈ వార్త  పలు చానెళ్లలో రావడంతో రోజా స్పందిస్తూ వీడియోను పోస్ట్ చేశారు. తాను ఇక్కడ బాగానే ఉన్నానని, తననెవరూ అరెస్ట్ చేయలేదని తెలిపారు. 'నవరత్నాల మీటింగ్' విజయవంతంగా జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు సమూహాలుగా ఉండడం ఇక్కడి చట్టాలకు వ్యతిరేకం కావడంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తాను ఇక్కడికి అతిథిగా మాత్రమే వచ్చానని, ఏదైనా ఉంటే నిర్వాహకులు, పోలీసులు చూసుకుంటారు తప్ప తనకేమీ సంబంధం లేదని రోజా ఆ వీడియోలో పేర్కొన్నారు.

YSRCP
Mla
Roja
kuwait
arrest
  • Loading...

More Telugu News