rajendra prasad: చిన్నప్పుడే అమ్మను కోల్పోయా.. కనకదుర్గనే అమ్మగా కొలిచా: రాజేంద్రప్రసాద్

  • చిన్నప్పుడే అమ్మను కోల్పోయా
  • దుర్గ గుడే నా పుట్టిల్లు 
  • అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ నేడు బెజవాడ కనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను కనకదుర్గ బిడ్డనని, దుర్గ గుడి తన పుట్టిల్లు అని చెప్పారు. చిన్నప్పుడే తాను కన్నతల్లిని కోల్పోయానని... కనకదుర్గమ్మనే అమ్మగా కొలిచానని తెలిపారు. చిన్న వయసులోనే ఇరుముడులు కట్టుకుని కొండపైకి వచ్చేవాడినని చెప్పారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. 

rajendra prasad
actor rajendra prasad
tollywood
  • Loading...

More Telugu News