ben stokes: అతను లేకపోతే యాషెస్ సిరీస్ ను ఇంగ్లండ్ గెలుచుకోలేదు: ఇయాన్ చాపెల్

  • స్టోక్స్ అత్యున్నత ఆటగాడు
  • అతను లేకపోతే జట్టుపై ప్రభావం పడుతుంది
  • ఓ వ్యక్తిని కొట్టిన ఘటనలో స్టోక్స్ పై నిషేధం

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు దూరమైతే ఆస్ట్రేలియాపై ఆ దేశం గెలవడం అసంభవమని ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. స్టోక్స్ లేకుండా యాషెస్ సిరీస్ ను గెలవడం ఇంగ్లండ్ కు సాధ్యం కాదని చెప్పాడు. అతని శక్తిసామర్థ్యాలు అటువంటివని... స్టోక్స్ మ్యాచ్ విన్నింగ్ ఆటగాడని అన్నాడు. అలాంటి అత్యున్నత ఆటగాడు లేకపోతే... దాని ప్రభావం జట్టుపై పడుతుందని చెప్పాడు. ప్రస్తుతం స్టోక్స్ పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ నైట్ క్లబ్ వద్ద ఒక వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో స్టోక్స్ పై నిషేధం విధించారు. విచారణ పూర్తయ్యేంత వరకు అతనిపై నిషేధం కొనసాగనుంది. విచారణలో స్టోక్స్ దోషిగా తేలితే... అతను ఆటకు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News