kcr: వాహన పూజ నిర్వహించిన కేసీఆర్!

  • దుర్గమ్మ పూజలో కేసీఆర్
  • కేటీఆర్ దంపతులు కూడా
  • ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రగతి భవన్ లో జరిగిన దసరా ఉత్పవాల్లో పాల్గొన్న ఆయన... అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ పూజలో కేసీఆర్ దంపతులతో పాటు, వారి కుమారుడు కేటీఆర్ దంపతులు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన ప్రయాణించే వాహనానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు.

kcr
KTR
kcr dasara pooja
telangana cm
  • Loading...

More Telugu News