ravela kishor babu: పార్టీని వీడుతానని ఎన్నడూ చెప్పలేదు: టీడీపీ నేత రావెల

  • నా మాటలను జవహర్, వర్ల వక్రీకరించారు
  • మాదిగలకు న్యాయం చేసేది చంద్రబాబే
  • ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు వివరిస్తా

ప్రత్తిపాడులో జరిగిన కార్యక్రమంలో తాను మాట్లాడిన మాటలను మంత్రి జవహర్, వర్ల రామయ్యలు వక్రీకరించారని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. టీడీపీకి మద్దతుగా ఉన్న మాదిగలకు న్యాయం చేయాలని మాత్రమే తాను అన్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనకు ఎంతో విశ్వాసం ఉందని... తనను రాజకీయంగా ప్రోత్సహించింది ఆయనేనని తెలిపారు. చంద్రబాబును కించపరిచేలా తాను కాని, మంద కృష్ణ మాదిగ కాని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. చంద్రబాబు మాత్రమే మాదిగలకు న్యాయం చేయగలరనే అపార నమ్మకం తమకు ఉందని అన్నారు.

ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిశీలనలో ఉందనే విషయాన్ని అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన రావెల... వర్గీకరణ జీవో అమలు కాలేదన్న ఆవేదన మాదిగల్లో ఉందని చెప్పారు. ఇటీవల సంక్షేమ శాఖలో కీలక పదవులన్నీ మాలలకే ఇచ్చారన్న భావన మాదిగల్లో ఉందని అన్నారు. తాను పార్టీకి వ్యతిరేకమని కానీ, పార్టీని వీడుతానని కానీ ఎన్నడూ చెప్పలేదని తెలిపారు. చంద్రబాబును కలసి అన్ని విషయాలను వివరిస్తానని చెప్పారు.  

ravela kishor babu
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News