paritala ravi: పరిటాల శ్రీరామ్ పెళ్లికి భారీ ఏర్పాట్లు.. రెండు హెలిపాడ్లు.. 1700 మంది పోలీసులు!

  • నాలుగు ఎకరాల్లో కల్యాణ మండపం
  • లక్ష మందికి ఏర్పాట్లు
  • 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు

దివంగత నేత పరిటాల రవీంద్ర, మంత్రి పరిటాల సునీతల కుమారుడు శ్రీరామ్ పెళ్లికి వారి స్వగ్రామం వెంకటాపురంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 1న వివాహం జరగనుంది. మొత్తం 5 రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకలు ఈ నెల 27 నుంచే ప్రారంభమయ్యాయి. పెళ్లికి సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నాలుగు ఎకరాల్లో పెళ్లి పందిరిని సిద్ధం చేశారు. భారీ సెట్టింగులతో కల్యాణవేదికను రూపొందిస్తున్నారు. కల్యాణ మండపంలో 50 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష మంది అతిథులకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 350 క్వింటాళ్ల బియ్యాన్ని సిద్ధం చేశారు. డ్రైనేజీకి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు జరిగాయి. 200 కుళాయిలు ఏర్పాటు చేశారు. మూడు రకాల స్వీట్లతో పాటు 30 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ వంటకాలను రుచి చూపించనున్నారు. భోజనశాలలో ఒకేసారి 50 వేల మంది భోంచేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుటుంబ సమేతంగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల మంత్రులు హాజరవుతున్నారు. 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  

paritala ravi
paritala sreeram
paritala sunitha
paritala sreeram marriage
  • Loading...

More Telugu News