mithali raj: ప్రేమలో ఫెయిలయ్యా...క్రికెట్ లో చాలా రాజకీయాలు ఉంటాయి: మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు

  • మూడు సార్లు ప్రేమలో ఫెయిలయ్యా
  • అన్ని రంగాల్లో రాజకీయాలు ఉంటాయి
  • టీమిండియాలో చాలా రాజకీయాలు ఉంటాయి
  • క్రికెట్ లో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు

క్రికెట్ లో ప్రతిభ ఉంటే చాలా అవకాశాలు వస్తాయని పలువురు చెబుతుంటారు. అయితే అది వాస్తవం కాదని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ వచ్చిన తరువాత వర్థమాన క్రికెటర్లకు అవకాశాలు పెరిగాయని, ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని సీనియర్లు, కోచ్ లు హితబోధ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే క్రికెట్ లో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదని తెలిపింది. టీమిండియాలో చాలా పాలిటిక్స్ ఉంటాయని తెలిపింది.

మహిళా క్రికెట్ లో కూడా ఉన్నాయని చెప్పింది. కేవలం క్రికెట్ అని మాత్రమే కాదని, ప్రతి రంగంలోనూ రాజకీయాలు ఉన్నాయని తెలిపింది. టీమిండియా ఆటగాళ్లతో హీరోయిన్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేలా తమతో ఎవరూ తిరగరని తెలిపింది. తనవరకు అలాంటి అనుభవాలు లేవని చెప్పింది. మూడు సార్లు ప్రేమలో విఫలమయ్యానని మిథాలీరాజ్ వెల్లడించింది. తనను విజయవంతమైన ఇండిపెండెంట్ మహిళగా కాబోయే భర్త గుర్తించాల్సి ఉంటుందని తెలిపింది. 

mithali raj
woman cricket captain
Indian woman cricket
  • Loading...

More Telugu News