yeswant sinha: జైట్లీకి యశ్వంత్ రిటార్ట్... నన్ను విమర్శిస్తే వాజ్ పేయి, అద్వానీని విమర్శించినట్టే!

  • కేంద్ర ఆర్థిక మంత్రిగా ఐదు పూర్తి స్థాయి, రెండు మధ్యంతర బడ్జెట్లు ప్రవేశపెట్టాను
  • విమర్శలు వ్యక్తిగతం కారాదు.. అంశాలకే పరిమితం కావాలి

ఉపాధి కోసం 80 ఏళ్ల వ్యక్తి ఎదురుచూస్తున్నాడంటూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా రిటార్ట్ ఇచ్చారు. ఆర్థిక మంత్రిగా తన పనితీరును విమర్శిస్తే నాటి ప్రధాని వాజపేయిని విమర్శించినట్లేనని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా తనపై విమర్శలు చేయడం ద్వారా జైట్లీ అద్వానీని కూడా అవమానించారని ఆయన అన్నారు. విమర్శలు చేసేటప్పుడు ఆయా అంశాలకే పరిమితం కావాలని, వ్యక్తిగత దాడి పనికిరాదని గతంలో ఎల్‌.కే. అద్వానీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిగా తాను ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, రెండు మధ్యంతర బడ్జెట్లు ప్రవేశపెట్టానని కూడా గుర్తుచేశారు. 

yeswant sinha
arun jaitli
bjp
central government
  • Loading...

More Telugu News