one day series: మ్యాచ్ గెలిచినా... సంతృప్తి చెందని ఆస్ట్రేలియా చీఫ్ కోచ్

  • గొప్ప గెలుపేమీ కాదన్న ఆసీసీ కోచ్
  • చివర్లో బ్యాటింగ్ బాగోలేదు
  • జంపా బౌలింగ్ బాగుంది

భారత్ తో బెంగళూరులో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆసీస్ చీఫ్ కోచ్ డేవిడ్ సాకర్ కు మాత్రం ఆ విజయం ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు. ఇదేమంత గొప్ప ప్రదర్శనేం కాదని ఆయన అన్నారు. గెలుపు వరకు ఓకే కానీ... గొప్ప ప్రదర్శనల్లో ఒకటి మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు.

43వ ఓవర్ వరకు బాగానే ఆడాం... కానీ ఇన్నింగ్స్ ను సరిగా ముగించలేక పోయామని చెప్పారు. తమ బౌలింగ్ కూడా మొదట్లో నిరాశపరిచిందని... చివర్లో బౌలర్లు ఆకట్టుకోవడంతో గెలిచామని తెలిపాడు. స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్ చాలా ఆకట్టుకుందని... భారత బ్యాట్స్ మెన్ ను నియంత్రించడంలో జంపా సఫలమయ్యాడని... జంపా వేసిన కొన్ని చక్కటి బంతులతో మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చిందని చెప్పాడు.

one day series
australia vs india
australia chief couch
  • Loading...

More Telugu News