మహార్నవమి శుభాకాంక్షలు తెలిపిన హీరో సూర్య... ఆలోచింపజేస్తున్న ట్విట్టర్ పోస్ట్
- మహిళలను దుర్గ, సరస్వతీ, లక్ష్మీలతో పోల్చిన హీరో
- సమస్యలను క్లుప్తంగా వర్ణించినందుకు మన్ననలు
`ఏ దుర్గా గర్భస్రావానికి గురికాకూడదని.. ఏ సరస్వతీ బడికి వెళ్లకుండా ఆగిపోకూడదని.. ఏ లక్ష్మీ డబ్బు కోసం తన భర్తను ప్రాధేయపడకూడదని.. కట్నానికి ఏ పార్వతీ బలి కాకూడదని.. ఏ సీతా నిశ్శబ్దంగా బాధపడకూడదని.. ఏ కాళీదేవికి ఫెయిర్నెస్ క్రీమ్ ఇవ్వకూడదని..ఈ నవమి సందర్భంగా ప్రార్థించండి’ అని సూర్య పోస్ట్ చేశారు. పండగ సందర్భంగా ఒక్క ట్వీట్ ద్వారా మహిళా సమస్యలను ఏకరువు పెట్టి, అందరిలో ఆలోచనలు కలిగించేలా చేసినందుకు నెటిజన్లు ఆయన్ని మెచ్చుకుంటున్నారు.