isis: ఐఎస్ఐఎస్ చీఫ్ అల్ బగ్దాదీ మరణించలేదు..ఇంకా బతికే ఉన్నాడట!

  • బగ్దాద్ హతమయ్యాడని ఏడాదిక్రితం ప్రకటన 
  • వీడియోతో మరోసారి వెలుగులోకి వచ్చిన అల్ బగ్దాదీ
  • శత్రుదేశాలకు హెచ్చరికలు, సైనికులకు భవిష్య నిర్దేశనం చేసిన బగ్దాదీ
  • వీడియో నిజమైనదేనని భావిస్తున్న నిపుణులు

ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీ ఇంకా బతికే ఉన్నాడా? ఏడాది క్రితం బురఖా ధరించి, స్త్రీ వేషధారణలో తిరుగుతూ సైన్యం కాల్పుల్లో మరణించాడని అమెరికా ప్రకటించిన సంగతి, దానిని ఇరాక్ నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్ బగ్దాదీ మాట్లాడాడంటూ ఐఎస్ అధికారిక మీడియా అల్ పుర్కాస్ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఐఎస్ ను వ్యతిరేకించే దేశాల మీడియా సంస్థలపై దాడులకు దిగాలని అతను పిలుపునిచ్చాడు. విజయానికి మార్గం సంయమనమని ఇస్లామిక్ స్టేట్ నేతలు, సైనికులు తెలుసుకున్నారని చెప్పాడు.

అవిశ్వాసులను నిరోధించాలని తన సైనికులకు పిలుపునిచ్చాడు. వాళ్ల పొత్తులు ఏమైనప్పటికీ (రష్యా, అమెరికా, ఇరాన్) వాళ్లని నిరోధించాలని స్పష్టంగా చెప్పాడు. అమెరికా, రష్యా, ఇరాన్ నేతృత్వంలోని అవిశ్వాస దేశాలపై మండిపడ్డాడు. జీహాద్ ను కొనసాగించాలని కాలిఫేట్ (ఐఎస్) సైనికులను కోరాడు.

ఇరాక్ లోని రమది పట్టణంపై ఆకస్మిక దాడులకు దిగిన ఇరాక్ దళాలు ఐఎస్ ను ఓడించిన మరుసటి రోజు మాట్లాడుతూ, 'మేం ఉంటాం, నిరోధిస్తాం' అని సంకీర్ణసేనలను ఉద్దేశించి తెలిపాడు. తన సైనికులను ఉద్దేశించి 'సహనంతో ఉండండి. లొంగేది లేదు' అంటూ భవిష్య నిర్దేశనం చేశాడు. ఈ వీడియోను పరిశీలిస్తున్న అమెరికా నిపుణులు ఇది నిజమైనదేనని భావిస్తున్నట్టు తెలిపారు. 

  • Loading...

More Telugu News