paritala sunitha: కేసీఆర్ అనంతపురం పర్యటన ఖరారు... ముహూర్తం ఎల్లుండే!

  • ఎల్లుండి పరిటాల శ్రీరామ్ వివాహం
  • హాజరుకానున్న కేసీఆర్, చంద్రబాబు
  • వివాహానికి ఘనంగా ఏర్పాట్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఎల్లుండి 1వ తేదీన దివంగత పరిటాల రవి, సునీతల కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహం వెంకటాపురంలో జరుగనుండగా, ఈ వివాహానికి కేసీఆర్ హాజరు కానున్నారు. కేసీఆర్ పర్యటన ఖరారైనట్టు సీఎం క్యాంపు కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి.

ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి విమానంలో చేరుకునే కేసీఆర్, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురం వెళతారు. శ్రీరామ్ దంపతులను ఆశీర్వదిస్తారు. ఇక ఇదే వివాహానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీంతో వెంకటాపురం గ్రామాన్ని ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకోగా, పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వివాహం సమయంలో కేసీఆర్, చంద్రబాబు మరోసారి కలవనున్నారని తెలుస్తోంది. అయితే, వీరిద్దరి మధ్యా ఎటువంటి అధికారిక చర్చలూ ఉండవని సమాచారం.

paritala sunitha
sriram
kcr
chandrababu
  • Loading...

More Telugu News