gurmeet: రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించిన హనీప్రీత్ మాజీ భర్త

  • చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు
  • గుర్మీత్, హనీప్రీత్ ల అక్రమ సంబంధాన్ని బయటపెట్టినప్పటి నుంచి హెచ్చరికలు
  • పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విశ్వాస్

తనకు ప్రాణాపాయం ఉందని... తనను చంపుతామంటూ డేరా గూండాలు బెదిరిస్తున్నారని డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా పోలీసులను ఆశ్రయించారు. డేరా సచ్ఛా సౌదా అనుబంధ సంస్థ కుర్బానీ నుంచి తనకు బెదిరింపు లేఖ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన విశ్వాస్ గుప్తా ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.

గుర్మీత్ సింగ్, హనీప్రీత్ ల మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన దగ్గర్నుంచి తనను చంపుతామంటూ డేరా గూండాలు బెదిరిస్తున్నారని చెప్పాడు. గుర్మీత్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని తెలిపాడు. 1991లో హనీప్రీత్ ను విశ్వాస్ గుప్తా వివాహం చేసుకున్నాడు. 

gurmeet
honey preet
haney preet husband
life threat to honey preet ex husband
  • Loading...

More Telugu News