rohingya muslims: డ్రగ్స్ రవాణా చేస్తున్న రోహింగ్యా ముస్లింలు

  • మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ కు డ్రగ్స్ సప్లై
  • ముగ్గురు రోహింగ్యాల అరెస్ట్
  • వీరిలో ఒకరు పాత శరణార్థి

మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ కు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు రోహింగ్యా ముస్లింలను, ఒక బంగ్లా జాతీయుడిని బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. శరణార్థులుగా బంగ్లాదేశ్ లోకి వస్తున్న వీరి వద్ద నుంచి 8 లక్షల మెథామెథమిన్ టాబ్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాబ్లెట్స్ లో కొకైన్ ఎక్కువగా ఉంటుంది. బంగ్లాదేశ్ యువత ఈ ట్యాబ్లెట్స్ ను ఎక్కువగా వాడుతోంది. ఈ ట్యాబ్లెట్స్ ను అరికట్టేందుకు ఆ దేశ అధికారులు చాలా కాలంగా కష్టపడుతున్నారు.

ఈ సందర్భంగా బెటాలియన్ కమాండర్ యేజర్ రవుల్ అమీన్ మాట్లాడుతూ, మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ కు వస్తున్న చాలా మంది రోహింగ్యా ముస్లింలు మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నారని తెలిపారు. తాజాగా అదుపులోకి తీసుకున్నవారిలో ఒకరు పాత శరణార్థి కాగా... ఇద్దరు కొత్తవారని చెప్పారు. 

rohingya muslims
myanmar
bangladesh
rohingya muslims drugs supply
  • Loading...

More Telugu News