deepoka padukine: పార్టీ ఫొటో పోస్ట్ చేసిన దీపిక.. నెటిజన్ల కామెంట్లు!

  • గత రాత్రి పార్టీలో పాల్గొన్న దీపికా పదుకునే
  • కరణ్ జోహర్, సిద్ధార్థ్ మల్హోత్రా, మనీష్ మల్హోత్రాలతో సెల్ఫీ  
  • ఫొటోను ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేసిన మనీష్ మల్హోత్రా
  • నెటిజన్ల కామెంట్లు 

కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపికా పదుకునే బాలీవుడ్ కు షారూఖ్ ఖాన్ సినిమాతో పరిచయమైంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. తాజాగా హాలీవుడ్ లో కూడా అడుగిడి అక్కడా రాణిస్తోంది. దీపికా తాజా చిత్రం 'పద్మావతి' ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై అభిమానులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంచితే, గత రాత్రి బాలీవుడ్ లో జరిగిన ఒక పార్టీలో దీపిక సందడి చేసింది. ఈ పార్టీలో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్, స్టార్ డిజైనర్ మనిష్ మల్హోత్రా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నలుగురూ ఒక సెల్పీ దిగారు. దానిని మనీష్ మల్హోత్రా తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేశారు. ఆ ఫోటోలోని దీపికను చూసిన అభిమానులు విమర్శలు ఎక్కుపెట్టడం ప్రారంభించారు. ఏంటి దీపికా పూటుగా తాగావా? అంటూ విమర్శిస్తున్నారు. 

deepoka padukine
karan johar
siddarth malhotra
manish malhotra
  • Loading...

More Telugu News