Kate winslet: డికాప్రియోతో తన అనుబంధాన్ని వివరించిన 'టైటానిక్' హీరోయిన్ కేట్ విన్ స్లెట్

  • టైటానిక్ మూవీ మా ఇద్దరికీ మంచి గుర్తింపు తెచ్చింది
  • డికాప్రియోతో స్నేహం దేవుడిచ్చిన వరం
  • డికాప్రియో నాకు కుటుంబ సభ్యుడు లాంటి వాడు
  • టైటానిక్ క్లైమాక్స్ లో జరిగిందే నిజజీవితంలో కూడా జరిగింది

హాలీవుడ్ లో అవార్డులు, రివార్డుల పరంగా సంచలనం సృష్టించిన 'టైటానిక్' సినిమా నుంచి ఆ సినిమా హీరో లియోనార్డో డికాప్రియోతో తనకు అనుబంధం ఏర్పడిందని హీరోయిన్ కేట్ విన్ స్లెట్ తెలిపింది. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి వీరి అనుబంధంపై ఎన్నో వార్తలు వెలువడ్డాయి. వీటిని వారిద్దరూ ఏనాడూ ఖండించలేదు. పైగా తామిద్దరం మంచి స్నేహితులమంటూ వారిద్దరూ పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక టీవీ షోలో దీని గురించి కేట్ విన్ స్లెట్ మాట్లాడింది. ఈ సందర్భంగా 'టైటానిక్' మూవీ తరువాత తమ ఇద్దరికి చాలా గుర్తింపు వచ్చిందని ఆమె తెలిపింది.

ఇప్పటికీ తమ ఇద్దర్నీ ప్రేక్షకులు గుర్తుంచుకోవడానికి కారణం 'టైటానిక్' మూవీయేనని తెలిపింది. ఆ షూటింగ్ సందర్భంగా ఏర్పడిన అనుబంధం నేటికీ కొనసాగుతోందని చెప్పింది. తామిద్దరం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నామని అంది. ఇంకా వివరంగా చెప్పాలంటే డికాప్రియో తన కుటుంబంలోని వ్యక్తిలాంటి వాడని చెప్పింది.

అతనితో స్నేహం దేవుడిచ్చిన వరంగా భావిస్తానని తెలిపింది. తమ ఇద్దరిపై ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయని తెలిపిన ఆమె, 'టైటానిక్‌' క్లైమాక్స్‌ లో జరిగినదే నిజ జీవితంలో కూడా జరిగిందని నవ్వుతూ చెప్పింది. కాగా, 'టైటానిక్' సినిమాలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జాక్ మరణించగా, అతనికి దూరమైన రోజ్ వేరే వ్యక్తిని వివాహం చేసుకుని జీవితం గడుపుతుంది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News