samantha: పెళ్లి తర్వాత సమంత చేయబోయే సినిమా ఇదేనట

  • పెళ్లి తర్వాత కూడా నటించనున్న సమంత
  • మిథాలీ రాజ్ బయోపిక్ లో శామ్
  • దక్షిణాది భాషలకు సమంతను సెలెక్ట్ చేసినట్టు సమాచారం

నాగ చైతన్య, సమంతల పెళ్లికి ఘడియలు దగ్గరపడుతున్నాయ్. అక్కినేని వారింట్లో ఇప్పటికే పెళ్లి హడావుడి ప్రారంభమైంది. పలు సినిమాలతో బిజీగా ఉన్న సమంత... పెళ్లి తర్వాత కూడా నటిస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో, పెళ్లి తర్వాత ఆమె ఫస్ట్ మూవీ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలో, దీనికి సంబంధించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ త్వరలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వివిధ భాషల్లో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. దక్షిణాది భాషల్లో మిథాలీ క్యారెక్టర్ కు సమంతను ఎంపిక చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

samantha
samantha ruth prabhu
akkineni
naga chitanya
mithali raj
mithali raj bio pic
tollywood
  • Loading...

More Telugu News