ram charan: మా ఆయన వచ్చి పదేళ్లయింది!: రామ్ చరణ్ పై ఉపాసన ట్వీట్

  • తెలుగు పరిశ్రమకు రామ్ చరణ్ వచ్చి పదేళ్లు పూర్తి
  • తానేంటో నిరూపించుకున్న మెగా పవర్ స్టార్
  • ఈ సందర్భాన్ని ట్విట్టర్ లో గుర్తు చేసిన ఉపాసన

తెలుగు చిత్ర పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడిగా 'చిరుత'తో ఎంటరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆపై 'మగధీర' వంటి ఎన్నో చిత్రాలతో తన స్టామినా నిరూపించుకున్నాడు. రామ్ చరణ్ తొలి చిత్రం విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా ఆయన భార్య ఉపాసనా కామినేని, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. ఇండస్ట్రీకి తన భర్త వచ్చి పదేళ్లు అయినట్టు గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తూ, డైటింగ్, ఎక్సర్ సైజులు చేసి, ఊహించని విధంగా ఫిట్ నెస్ ను సంపాదించుకుని ఎంతో నాజూకుగా తయారైన ఉపాసన, తన భర్తపై పెట్టిన తాజా పోస్టును ఇక్కడ చూడవచ్చు.

ram charan
upasana
  • Loading...

More Telugu News