dera sacha sauda: డేరా బాబాను వ్యతిరేకించిన పోలీసులు, జర్నలిస్టులను చంపేస్తాం: డేరా ఖుర్మానీ హెచ్చరిక

  • డేరా బాబాను విమర్శించిన ఎవరినీ వదలం
  • బీజేపీ కూడా మోసం చేసింది 
  • 200 మంది ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నారు

అత్యాచారం కేసులో జైలు జీవితం గడుపుతున్న డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడినవారిని వదిలిపెట్టబోమని డేరా ఖుర్బానీ విభాగం హెచ్చరించింది. డేరా బాబాను కించపరిచేలా మాట్లాడిన హర్యానా పోలీస్ అధికారులు, జర్నలిస్టులు, డేరా మాజీ అనుచరులను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

బీజేపీ ప్రభుత్వం కూడా తమ డేరాను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ వద్ద ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్న 200 మంది పిల్లలు ప్రతీకారం తీర్చుకుంటారని తెలిపింది. ఈ మేరకు హెచ్చరిక లేఖలను చండీఘడ్ లోని మీడియా కార్యాలయాలకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపింది. మరోవైపు, డేరా ఖుర్బానీ విభాగం రాసిన హెచ్చరిక లేఖలపై హర్యాణా పోలీసులు విచారణ చేపట్టారు.

dera sacha sauda
dera bab
gurmeet ram rahim singh
dera khurmani
  • Loading...

More Telugu News