pawa kalyan: అందుకే పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం: 'బిగ్ బాస్' విజేత శివబాలాజీ

  • 'అన్నవరం' సినిమా సమయంలో పవన్ కల్యాణ్ తో పరిచయమైంది
  • సాధారణంగా పవన్ తన పుట్టిన రోజు చేసుకోరు 
  •  'కాటమరాయుడు' సెట్లో నా పుట్టిన రోజు నిర్వహించారు
  • ఆయనకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని కత్తిని బహూకరించాను

ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని 'బిగ్ బాస్' సీజన్ 1 విజేత శివబాలాజీ తెలిపాడు. పవన్ కల్యాణ్ తో తనకు ఏడేళ్ల క్రిందట అన్నవరం సినిమా షూటింగ్ సందర్భంగా పరిచయమైందని తెలిపాడు. అప్పటి నుంచి తమ అనుబంధం కొనసాగుతోందని అన్నాడు.

'సాధారణంగా పవన్ తన పుట్టినరోజు జరుపుకునేందుకు పెద్దగా ఇష్టపడరు. అయితే, ఆమధ్య కాటమరాయుడు సినిమా షూటింగులో నా పుట్టిన రోజును మాత్రం యూనిట్ సభ్యులందరి మధ్య, నా కుటుంబ సభ్యులందరి సమక్షంలో చేశారు. అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అందుకే పవన్ కల్యాణ్ కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. తను ప్రజానాయకుడు కావడంతో ఆయనకు కత్తిని బహూకరించాను" అని చెప్పాడు శివబాలాజీ.  

pawa kalyan
shiva balaji
birthday
  • Loading...

More Telugu News