pakistan: ఉగ్రవాదుల విషయంలో అమెరికాకు కౌంటర్ ఇచ్చిన పాకిస్థాన్!

  • హఫీజ్ లాంటి వాళ్లతో మాకూ భారమే
  • వీళ్లంతా మీరు పెంచి, పోషించినవాళ్లే
  • వైట్ హౌస్ లో కూడా వీరు ఆతిథ్యం స్వీకరించినవారే!

ఉగ్రవాదులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడాన్ని పాకిస్థాన్ ఆపాలంటూ అమెరికా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రదేశానికి పాకిస్థాన్ కౌంటర్ ఇచ్చింది. హక్కానీ, లష్కరేతాయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలు తమకు కూడా భారంగా మారాయని ఏషియా సొసైటీ ఫోరమ్ లో పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.

హఫీజ్ సయీద్ లాంటి వాళ్లు తమకూ తలనొప్పేనని, త్వరలోనే వారి పని పడతామని చెప్పారు. ఇదే సమయంలో... సయీద్ లాంటి ఉగ్రవాదులను మీరే పెంచి పోషించారంటూ అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. 20 ఏళ్ల కింద వరకు వీళ్లంతా మీకు ఎంతో ఇష్టమైన వాళ్లని ఎద్దేవా చేశారు. మీ వైట్ హౌస్ లో వీళ్లంతా ఆతిథ్యం స్వీకరించిన వాళ్లేనని దెప్పిపొడిచారు. ఆఫ్ఘన్ లో జరుగుతున్న అరాచకాలకు పాక్ ను బలి చేయవద్దని అన్నారు.  

pakistan
america
pakistan counter to america
terrorism
  • Loading...

More Telugu News