new excise policy: తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం.. మారనున్న వైన్ షాపుల వేళలు!


వచ్చే నెల 1వ తేదీ నుంచి తెలంగాణలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్తగా ఏర్పాటు కానున్న 2,146 మద్యం షాపులలో రహదారుల పక్కన వుండే మద్యం షాపులన్నీ కచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంది. మరోవైపు నూతన మద్యం పాలసీలో భాగంగా... అదనంగా మరో రెండు గంటల పాటు వ్యాపారం చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు వైన్ షాపులు ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 10 వరకు ఉంటున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఈ షాపులు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగనున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News