ananthapuram: ఆసుప‌త్రిలో రోజుకు క‌నీసం ఇద్ద‌రు, ముగ్గురు చ‌నిపోతారు: 9 మంది మృతిపై ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్‌

  • ప్రాణాల మీద‌కు వ‌చ్చిన కేసుల‌ను ప్రైవేటు ఆసుప‌త్రి నుంచి పంపిస్తున్నారు
  • ఆసుపత్రికి వచ్చే వారికి వైద్యం చేయకుండా ఎలా తిప్పి పంపించగలం?

అనంత‌పురం ప్ర‌భుత్వాసుప‌త్రి, ఏఎంసీ విభాగంలో 9 మంది రోగులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ఆ ఆసుప‌త్రి సుప‌రింటెండెంట్ జగన్నాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రాణాల మీద‌కు వ‌చ్చిన కేసుల‌ను ప్రైవేటు ఆసుప‌త్రి నుంచి త‌మ‌ ఆసుప‌త్రికి పంపిస్తున్నారని చెప్పారు. ఆసుప‌త్రిలోని అన్ని విభాగాల్లో రోజుకు క‌నీసం ఇద్ద‌రు, ముగ్గురు చ‌నిపోతార‌ని వ్యాఖ్యానించారు.

విషమ పరిస్థితుల్లో తమ ఆసుపత్రికి వచ్చే వారికి వైద్యం చేయకుండా ఎలా తిప్పి పంపించగలమని ఆయన ప్రశ్నించారు. వైద్యం కోసం వచ్చిన అందరికీ వైద్యం చేయాల్సిందేనని చెప్పారు. ఏఎంసీ విభాగంలో 24 గంట‌ల‌లోపే తొమ్మిది మంది మృతి చెంద‌డం ప‌ట్ల ఆ ఆసుప‌త్రి వైద్యుల తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  

చనిపోయిన వారి వివరాలతో పాటు, ఎందుకు చనిపోయారన్న విషయంపై తనకు నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించానని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యం కారణమైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. విషమ పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవడానికి ఆ ఆసుపత్రికి ప్రతిరోజు చాలా మంది రోగులు వస్తుంటారని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News